Custody : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. కస్టడీ కోసం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వంశీని న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పోలీసులకు న్యాయస్థానం సూచించింది.
Read Also: MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
లాయర్ సమక్షంలో పోలీసులు కస్టడీలోకి తీసుకుని సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంపై కీలక అంశాలను బయటకు తెచ్చే అవకాశం ఉంది. న్యాయవాది సమక్షంలోనే వల్లభనేని వంశీని విచారించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం, సాయంత్రం సమయంలో మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. ముఖ్యంగా విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. అతడికి బెడ్ అనుమతి ఇచ్చింది.
కాగా, టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో సత్యవర్ధన్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అంతేకాక..ఇతర కేసులు కూడా వంశీని చుట్టుముట్టనున్నాయి. ఫిర్యాదుదారునే కిడ్నాప్ చేసి బెదిరించిన కేసు కాబట్టి బెయిల్ కూడా అంత సామాన్యంగా రాదని అంటున్నారు.
Read Also: Caste Census : కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్