Site icon HashtagU Telugu

AP : కౌంటింగ్ రోజు డ్రై డే – సీఈవో ముకేశ్

Ap Counting

Ap Counting

జూన్ 4న ఎన్నికల ఫలితాలు (Polling Results) వెలువడనుండగా, ఆ రోజు కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ ఫలితాలను జూన్ 04 ప్రకటించడంతో ఆ రోజు కోసం దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి మరోసారి విజయం సాధించి , హ్యాట్రిక్ కొడుతుందా..? లేక కాంగ్రెస్ విజయం సాధిస్తుందా..? అని కొంతమంది భావిస్తుంటే..ఇటు ఏపీలో ఎవరు విజయం సాధిస్తారా అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థుల్లో బెదురు మొదలైంది. ఎవరెవరిని విజయం వరిస్తుంది, ఎవరికి అపజయం పరిచయం అవుతుందో తెలియాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏపీ విషయానికి వస్తే.. కౌంటింగ్ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు తెలిపారు. జూన్ 4న డ్రై డే(మద్యం దుకాణాల మూసివేత)గా ప్రకటిస్తున్నామన్నారు. అవసరమైన చోట 144 సెక్షన్ విధిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్లను అభ్యర్థులు/ వారి ప్రతినిధులు రోజుకు 2 సార్లు ఫిజికల్గా పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ తర్వాత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దృష్ట్యా కౌంటింగ్‌కు గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కేంద్ర బలగాలతో భద్రత చర్యలు చేపట్టారు.

ముఖ్యముగా అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతి జిల్లా చంద్రగిరిపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తత వాతావరణమే కొనసాగుతోంది. ఈ మూడు నియోజకవర్గాల టీడీపీ, వైసీపీ నేతలపై పోలీసులు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో ఊళ్లు విడిచి వెళ్లారు. అంతేకాదు అల్లర్లలో పాల్గొన్నవారు, కారణమైన వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. అందుకే పోలింగ్ రోజు ఎలాంటి ఉద్రికత్తలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు.

Read Also : Phone Tapping : మీడియా చానెల్స్ యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ – రాధాకిషన్ రావు