Site icon HashtagU Telugu

Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ !

Corona Anandaiah

Corona Anandaiah

Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య గుర్తున్నాడా ? కరోనా విలయ తాండవం చేస్తున్న టైంలో ఆనందయ్య పేరు మార్మోగింది. దీంతో ఆనందయ్య పేరు కాస్తా కరోనా మందు ఆనందయ్యగా మారిపోయింది. ఆయుర్వేద మందుల తయారీలో పేరుగాంచిన ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారట. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో డాక్టర్ ఆనందయ్యతో పాటు ఆయుర్వేదం పారంపర్య సంఘం ప్రతినిధులు తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.

We’re now on WhatsApp. Click to Join

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలతో శనివారం సమావేశం అవుతారు. అనంతరం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ప్రజా గళం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సత్తెనపల్లిలో జరిగే ప్రజాగళం సభకు టీడీపీ చీఫ్ హాజరవుతారు. ఈ సభలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Also Read : Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ

  • కరోనా సెకండ్ వేవ్‌లో డాక్టర్ ఆనందయ్య తయారు చేసిన మందు ఎలాంటి ఫలితాలనిచ్చిందో అందరికీ తెలిసిందే.
  • నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య.. కరోనా నివారణకు వన మూలికలతో మందును తయారు చేశారు.
  • కరోనా టైంలో ఆనందయ్య  కరోనా మందు కోసం జనాలు నెల్లూరు జిల్లాలోని ఆనందయ్య ఇంటి ఎదుట క్యూకట్టేవారు. ఆనందయ్య మందును చాలా చోట్ల పంపిణీ కూడా చేశారు.
  • రాజకీయపార్టీలు కూడా ఆనందయ్య తయారుచేసిన కరోనా మందును తమ నియోజకవర్గాలలోని ప్రజలకు పంపిణీ చేసిన రోజులున్నాయి.
  • ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం అవసరమంటూ పంపిణీని కొన్నిరోజుల పాటు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ తరువాత మందు పంపిణీకి అనుమతినిచ్చింది.
  • కరోనా మందు కోసం జనం పోటెత్తడంతో కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదు అయ్యాయి. దీంతో కృష్ణపట్నం ఎవరూ రావొద్దంటూ నేరుగా ఆయా జిల్లాలకే మందు పంపిణీ జరిగేలా చూశారు ఆనందయ్య.
  • కరోనా వ్యాధిని తగ్గించేది కానప్పటికీ దాని వల్ల ఎలాంటి దుష్ట్రభావాలు లేకపోవడంతో ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది.

Also Read :Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్