ఆంధ్రప్రదేశ్(AP)లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC Elections) సందర్భంగా గుంటూరు(Guntur)లో వివాదం చోటుచేసుకుంది. గురువారం తెలుగురాష్ట్రాల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana)లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Janasena : జనసేన కోసం భారీగా ఖర్చుచేసా..కానీ పవన్ పట్టించుకోలే – జబర్దస్త్ నటుడు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ నియోజవర్గాలకు ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. అయితే గుంటూరులోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఓ అభ్యర్థి తరఫున ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పార్టీల మధ్య వివాదం పెరిగిన కారణంగా అధికారులు మధ్యవర్తిత్వం వహించారు. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద PDF అభ్యర్థి లక్ష్మణరావు కోసం ఓటేయాలని ఓ టెంట్ ఏర్పాటు చేయడం, పోస్టర్లు అతికించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారు వెంటనే ఎన్నికల అధికారులను సంప్రదించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల సహాయంతో టీడీపీ నేతలు తాము ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా చూడాలని కోరారు. ఎన్నికల అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన
ఇక ఏపీలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచరర్ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యా యులు ఓటు వేయనున్నారు.