Shailajanath: ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పొలిటికల్ పరంగా జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పటివరకు ప్రతిపక్ష వైసీపీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు పార్టీని వీడారు. జగన్ సైతం ముఖ్య నాయకులు పార్టీ వీడుతుండటంతో ఏం చేయాలో తోచటంలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలపేతం చేద్దామని ఇప్పటికే జగన్ ప్లాన్స్ వేశారు. అయితే వరుసపెట్టి పార్టీ సీనియర్లు రాజీనామా చేస్తుండటంతో జగన్ సైతం తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది.
ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Shailajanath) వైసీపీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జగన్‌తో చర్చలు కూడా జరిగిపినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇందుకు తగ్గినట్లుగానే తాజాగా ఓ ఫొటో ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శైలజానాథ్ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: WTC Final Scenario: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగలదా? గబ్బా టెస్టు తర్వాత మారిన లెక్కలు!
జగన్‌ను కలిసిన శైలజానాథ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కలిశారు. కర్నూలులో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సందర్భంలో వైఎస్ జగన్‌ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇకపోతే శైలజానాథ్ అనంతపురం జిల్లాలో పేరొందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ ప్రస్థానం సైతం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పొందారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని సమయంలో సైతం ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఏపీ పీసీసీగా కూడా బాధ్యతలు చేపట్టారు.