ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మద్యం (Liquor ) వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం (Vizag) కు చెందిన డాక్టర్ షిరిన్ రెహ్మాన్ (Dr. Shirin Rehman) ఈ పిల్ ను దాఖలు చేశారు. ఒక వ్యక్తి నెలకు ఎంత మద్యం కొనుగోలు చేయాలో పరిమితి పెట్టాలని ఆమె కోరారు. ఆధార్ కార్డు ద్వారా ట్రాకింగ్ చేస్తూ, ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనుగోలు చేసాడనేది యాప్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది. దాంతో మద్యం దుర్వినియోగాన్ని నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్
ఈ పిటిషన్‌లో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. 21 సంవత్సరాల లోపు వారు మద్యం కొనుగోలు చేయకుండా కఠిన నిషేధం ఉండాలని డాక్టర్ షిరిన్ కోరారు. యువతలో మద్యం వినియోగం పెరుగుతోందని, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు అధికంగా తాగుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరిన మద్యం వినియోగం వల్ల ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరిస్తుండటంతో, మద్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏకంగా పన్ను చెల్లించే ప్రజలపైనే భారం వేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ పిల్‌ను హైకోర్టు స్వీకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై స్పష్టమైన వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ ఖజానాకు మద్యం విక్రయాల నుంచి అధిక ఆదాయం వచ్చినా, ప్రజల ఆరోగ్యానికి కేటాయించే ఖర్చులు కూడా అధికంగానే ఉన్నాయి. దీనికి తోడు ప్రజల ఆరోగ్య భద్రత కోసం, మద్యం వినియోగాన్ని నియంత్రించే విధానాలు తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ ఈ పిల్ అమలులోకి వచ్చినా, లేకపోయినా ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టి, బాధ్యతతో కూడిన చర్యలు తీసుకుంటేనే సమాజానికి మేలని చెప్పొచ్చు.