YSRCP Manifesto: నవరత్నాలకు మించి వైసీపీ మేనిఫెస్టో ..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే పోటీ చేసి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్నిప్రక్కటించింది. నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు వరకు తమ మేనిఫెస్టోని ప్రకటించలేదు.

YSRCP Manifesto: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే పోటీ చేసి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్నిప్రక్కటించింది. నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు వరకు తమ మేనిఫెస్టోని ప్రకటించలేదు. గెలుపులో కీలక పాత్ర పోషించే మేనిఫెస్టోని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. కాగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ పార్టీ త్వరలో తమ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయనుంది. ఈ సారి మేనిఫెస్టో ప్రత్యర్థి పార్టీలకు దిమ్మతిరిగేలా రూపొందిస్తున్నారట. గత ఎన్నికల వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో మేనిఫెస్టోని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి నవరత్నాలను మించి సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించారట. ఈ నెల 26న వైసీపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంత సిద్దం’ బస్సు యాత్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోమవారం విరామం ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై క్యాడర్ తో జగన్ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాలపై చర్చించనున్నారు.

We’re now on WhatsAppClick to Join

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుకు కౌంటర్‌గా వైసీపీ మేనిఫెస్టో రూపొందుతోంది. మంగళవారం వైసీపీ సోషల్ మీడియా విభాగంతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సోషల్ మీడియా విభాగంతో భేటీ అనంతరం జగన్ బస్సుయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. రేపు విజయనగరం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. రోడ్ షో, బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

Also Read: CM Jagan : అదే జరిగితే జగన్ అక్కడిక్కడే మరణించేవారట – పోసాని