Site icon HashtagU Telugu

Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించ‌నున్న‌సీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష

CM to launch Annadata Sukhibhav scheme...interview with farmers, review with activists

CM to launch Annadata Sukhibhav scheme...interview with farmers, review with activists

Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (ఆగస్టు 2) ఉదయం పలు కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలానికి పర్యటించనున్నారు. ముఖ్యంగా తూర్పు వీరాయపాలెం గ్రామంలో “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని రూపొందించబడింది. ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని ఉండవల్లిలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో దర్శికి బయలుదేరుతారు. సుమారు 10.35 గంటలకు దర్శి రెవెన్యూ విలేజ్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఘనంగా స్వాగతిస్తారు.

Read Also: US Gun Violence : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అక్కడి నుంచి సీఎం 10.45 గంటలకు రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి బయలుదేరుతారు. కేవలం ఐదు నిమిషాల ప్రయాణం తర్వాత, ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం మధ్యాహ్నం 1.45 వరకు కొనసాగుతుంది. అనంతరం 1.50కి రోడ్డు మార్గంలో కాడ్రేకు బయలుదేరుతారు. అక్కడ జరిగే సమావేశంలో ఆయన గంటపాటు పాల్గొంటారు. పార్టీలో జరుగుతున్న కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చర్చిస్తారు.

సమావేశం అనంతరం మధ్యాహ్నం 2.50కి దర్శి హెలిప్యాడ్‌కు తిరిగి వెళతారు. అక్కడినుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి, 3.35కి ఉండవల్లికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొననున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా మారుతుందనే నమ్మకంతో పార్టీ నేతలు ఉన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, ఉత్పత్తి ఖర్చుల భారం తగ్గించే పలు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి కార్యక్రమంలో వెల్లడించనున్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత శక్తివంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’