AP : సీఎం రమేష్ అరెస్ట్.. తాడువ వద్ద ఉద్రిక్త వాతావరణం

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు, కొందరు కార్యకర్తలను వెంటబట్టుకుని కూటమి నేతలపై దాడులకు దిగాడు

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 08:22 PM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ నేతలు (YCP Leaders) , వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఓటమి భయంతో కూటమి అభ్యర్థుల ఫై , కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తూ..అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. తాజాగా అనకాపల్లి లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనకాపల్లి (Anakapalli) జిల్లా మాడుగుల మండలం తాడువలో కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు, కొందరు కార్యకర్తలను వెంటబట్టుకుని కూటమి నేతలపై దాడులకు దిగాడు. బీజేపీ నాయకుడు గంగాధర్‌ని చెప్పుతో కొట్టారు. రెండు ద్విచక్రవాహనాలు ధ్వసం చేశారు. ఈ దాడిలో నలుగురు తీవ్రగాయాలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ విషయం తెలుసుకున్న కూటమి అభ్యర్థి సీఎం రమేష్..తాడువకు బయలు దేరారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సీఎం రమేష్ ను అడ్డుకున్నారు. తన మనిషిని ఎందుకు కొట్టారు..? ఆయన చేసిన తప్పేంటి..? అని ప్రశ్నిస్తూ.. పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసు జీపులో తరలించారు. ఇదే క్రమంలో రమేష్ ఫై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. కానీ రమేష్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు సిఎం రమేశ్‌ను తరలిస్తుండగా, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పై దాడికి దిగారు. ఈ దాడిలో రమేశ్‌కు చెందిన మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఎప్పుడు ఏంజరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Read Also : Prathinidhi 2 : ఎన్నికల పోలింగ్ కు 2 రోజుల ముందు ప్రతినిధి 2 దింపుతున్న ‘మూర్తి’..