CM Jagan: నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

మూడో విడత ఆసరా పథకాన్ని శనివారం ఉదయం 11 గంటలకు దెందులూరులో సీఎం జగన్‌ (CM Jagan) బటన్‌ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పర్యవేక్షించారు.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 07:20 AM IST

మూడో విడత ఆసరా పథకాన్ని శనివారం ఉదయం 11 గంటలకు దెందులూరులో సీఎం జగన్‌ (CM Jagan) బటన్‌ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పర్యవేక్షించారు. సీఎం తాడేపల్లి నుంచి హెలీకాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం పదిన్నర గంటలకు దెందులూరు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అవుతారు.

ఉదయం 10.40 గంటలకు జాతీయ రహదారిపై టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళతారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 87 లక్షల మంది మహిళలకు రూ. ఆరు వేల 500 కోట్లను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సందర్భంగా వర్చువల్‌ పద్ధతిలో రూ. 2 కోట్ల 56 లక్షలతో దెందులూరులో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించి, పెదవేగి మండలం జగన్నాథపురం పరిధిలో నూతనంగా నిర్మించనున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టంను, పెదవేగిలో నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు.

Also Read: Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు

షెడ్యూల్ ఇదే..!

ఏలూరు జిల్లా దెందులూరు నేడు సీఎం జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ను జిల్లా అధికారులు విడుదల చేశారు. తాడేపల్లి నుంచి ఉ. 10. 30గంటలకు సీఎం జగన్ దెందులూరుకు చేరుకుంటారు. ఉ. 10. 30-10. 40 గంటల వరకు హెలీప్యాడ్ వద్ద నేతలు, అధికారులు సీఎంను కలుస్తారు. ఉ. 10. 50 గంటలకు సీఎం సభాప్రాంగణానికి చేరుకుని మ. 12. 35వరకు సభలో పాల్గొని. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత సాయాన్ని విడుదలచేస్తారు. మ. 1. 05 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 1. 35 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.