దసరా శరన్నవరాత్రుల సందర్బంగా విజయవాడ కనకదుర్గ (Vijayawada Kanaka Durga)ను సీఎం జగన్ (CM Jagan) దర్శించుకొని , అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, వనిత, జోగి రమేష్, విజయవాడ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుర్గ గుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్నిసీఎం జగన్ కు అందజేశారు. ఆలయానికి చేరుకోగానే ఆలయం అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో జగన్ కు స్వాగతం పలికారు. దుర్గగుడి చిన్న రాజగోపురం వద్ద జగన్‌కు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు సీఎం జగన్ ను ఆశీర్వదించి, అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
Read Also : Super Dog : సూపర్ డాగ్.. ఐదు అంతస్తుల నుంచి దూకినా ఏమీ కాలేదు !!