CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోలో పర్యటించారు. ఎమ్మిగనూరు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ జగనన్న చేదోడు పథకం కిందా బటన్ నొక్కి రూ.325.02 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
సీఎం జగన్ మాట్లాడుతూ…జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా ఈ రోజు 3.25లక్షల మందికి రూ.325కోట్లను వారి ఖాతాలకు జమ అయినట్లు సీఎం చెప్పారు. 3.25లక్షల మందికి లబ్ది కలిగిస్తున్న జగనన్న చేదోడు పథకంలో లక్షా 85వేల మంది టైర్లు, 1,4,500మంది రజకులు, 40వేల మంది నాయిబ్రాహ్మణులకు సాయం అందుతుందని సీఎం తెలిపారు. జగనన్న చేదోడు పథకం ద్వారా గడిచిన నాలుగేళ్లలో రూ.1251 కోట్ల రుపాయలు వెచ్చించినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 52నెలల పాలనలో నవరత్నాల్లోని ప్రతి కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలను చేయి పట్టి నడిపిస్తున్నట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కరే అని.. గతంలోని అప్పులు ఇప్పుడు అప్పులకు తేడా గమనించాలన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి ఫైబర్ గ్రిడ్, అమరావతి, విద్యుత్ కొనుగోలు అన్నింటిలో అడ్డగోలుగా దోచుకున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు పేదలకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జాబు కావాలి అంటే బాబు రావాలి అని గత ఎన్నికల్లో ప్రచారం చేశారని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. త్వరలో రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని ఈ యుద్ధంలో జరగబోయేది క్లాస్ వార్ అని చెప్పుకొచ్చారు సీఎం జగన్.
Also Read: TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం