Jagan : మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు – జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole Public Meeting) ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జ‌గ‌న్‌ (CM Jagan) పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు […]

Published By: HashtagU Telugu Desk
Cm Jagan Ongole Public Meet

Cm Jagan Ongole Public Meet

ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole Public Meeting) ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జ‌గ‌న్‌ (CM Jagan) పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని , పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని. మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేసారని , రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను మోసం చేశారు. చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇక మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారని, కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు మాదిరి నాకు నాన్‌రెసిడెంట్స్‌ ఆంధ్రాస్‌ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకమని ప్రసంగించారు.

Read Also : Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?

  Last Updated: 23 Feb 2024, 03:56 PM IST