Site icon HashtagU Telugu

APSRTC : ఆర్టీసీ ఉద్యోగుల అకౌంట్లోకి ఇక ఆ డబ్బులు కూడా..

Apsrtc

Apsrtc

APSRTC : ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగులపై మరోసారి వరాల జల్లు కురిపించారు. ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) ఉద్యోగులకు తాజాగా ఆయనొక గుడ్ న్యూస్ వినిపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు డే ఔట్‌, నైట్‌ ఔట్‌ భత్యాల కింద (TA) రోజుకు రూ. 150 నుంచి రూ.400 దాకా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని ఈ నెల నుంచే అమలుచేసి మార్చి 1న ఇచ్చే జీతంలో కలిపి ఇవ్వాలని సీఎం జగన్  డిసైడ్ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ జారీ అయింది.  దీనిపై ఈడీల కమిటీ ఫైనల్ అయిందని ఎన్‌ఎంయూఏ (నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌) వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

ఆర్టీసీ సంఘం నేతలు ఈడీలతో చర్చలు జరపగా.. పలు సమస్యల పరిష్కారానికి అధికారులు అంగీకారం తెలిపారు. ఆర్టీసీలో విధుల్లో చేరినప్పుడు ఉండే విద్యార్హతల ఆధారంగా ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (AAS) అమలు చేయడం , ఆర్టీసీ వైద్యుడితో పాటు ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన వైద్య నివేదిక  ప్రకారం తీసుకునే సిక్‌ లీవును కూడా పరిగణనలోకి తీసుకోవడం, సీట్‌ వంటి అన్ని భత్యాలను చెల్లించడం, అంతర్‌ జిల్లాల బదిలీలు చేపట్టడం వంటి వాటిపై ఈడీల కమిటీతో చర్చలు సఫలమయ్యాయని ఎన్‌ఎంయూఏ పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ శ్రమకు తగిన ఫలితం రాబోతోందని, అలవెన్సుల చెల్లింపు తమకు ఎంతో ప్రోత్సాహకం అని అంటున్నారు.

Also Read : 3rd Death – A Week : వారంలో మూడో మరణం.. అమెరికాలో ఆగని భారత విద్యార్థుల మరణాలు

ఇటీవలే ఏపీ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల అంశాన్ని కీలకంగా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు 6 వేలకు పైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీకి చేసే ప్రతిపాదనకు జగన్  ఆమోదం తెలిపారు. వీటితో పాటు అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలోనే డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ 2024ను విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపించడంతో యువత, ఉద్యోగ వర్గాలను ఆకర్షించడంపై జగన్ సర్కారు ప్రధానంగా ఫోకస్ పెట్టింది.

Also Read :MQ 9B : ఇండియాకు 31 ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్లు .. ఎలా పనిచేస్తాయో తెలుసా ?