Site icon HashtagU Telugu

CM Jagan Convoy Accident : పెను ప్రమాదం నుండి బయటపడ్డ సీఎం జగన్

Cm Jagan Convoy Accident

Cm Jagan Convoy Accident

ఇటీవల వరుసగా రాజకీయ నేతలు (Political Leaders) పెను ప్రమాదాల నుండి క్షేమంగా బయటపడుతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలట్ గమనించి కిందకు దింపడం తో ప్రమాదం తప్పినట్లయింది. నిన్న ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్(KTR) పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా… ఒక్కసారిగా ప్రచార రథానికి ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో కేటీఆర్ ముందుకు పడ్డారు. అదే వాహనంలో ఉన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు కూడా వాహనం నుంచి కింద పడడంతో స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈరోజు ఏపీ సీఎం జగన్ (CM Jagan) సైతం పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. రెండ్రోజులుగా జగన్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వేముల మండలంలో వైసీపీ నేతలతో (YSRCP) సమీక్ష అనంతరం ఇడుపులపాయకు (Idupulapaya) తిరుగుపయనం అయ్యే సమయంలో మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. జగన్ ప్రయాణిస్తున్న కారును (YS Jagan Car).. కాన్వాయ్‌లోని మరో కారు ఢీ కొన్నది. ఇలా ఒకట్రెండు కార్లను జగన్ కారు ఢీ కొంటూ ఆగకుండా ముందుకు వెళ్లింది. దీంతో రెండు, మూడు కార్ల వెనుక భాగం దెబ్బతిన్నది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు, పెద్ద ప్రమాదం కాకపోవడంతో అధికారులు , వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత వేరే కారులో ఇడుపులపాయ ఎస్టేట్‌కు జగన్ చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రేపు జగన్ విజయవాడ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న సీఎం, కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read Also : Telangana Polls : బీసీ నేత సీఎం కావాలంటే బిజెపికి ఓటు వేయాలి – బండి సంజయ్