Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 04:00 PM IST

 

CM Jagan bus yatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్(cm jagan) ప్రకటించగా.. ఎన్నికల ప్రచారా(Election campaign)నికి ముహూర్తం ఖరారు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం(siddham) పేరుతో ఇడుపులపాయ(Idupulapaya) నుంచి బస్సు యాత్ర(bus yatra)ను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత తలశిల రఘురామ్ మాట్లాడుతూ.. మేము సిద్దం పేరుతో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. ఎన్నికల వరకు జగన్ జనంలోనే ఉండాలని నిర్ణయించారని ఆయన చెప్పారు.

read also: TB Symptoms: సైలెంట్ గా వచ్చి ప్రాణాలు తీస్తున్న క్షయ (TB)

ప్రతి పార్లమెంట్‌లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసినట్టు తలశిల తెలిపారు. బస్సు యాత్రతో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేం సిద్ధం బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు.

read also:Venkatesh – Son In Law : విక్టరీ వెంకటేష్ రెండో అల్లుడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా ?

మొత్తం బస్సు యాత్ర 21 రోజుల వరకు కొనసాగనుండగా.. 21 బహిరంగ సభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉంటారని, రాత్రి బస కూడా ఆయా జిల్లాలోనే ఉంటుందని రఘురామ్ స్పష్టం చేశారు. అయితే, పూర్తి రూట్ మ్యాప్ రేపు (మంగళవారం) ప్రకటిస్తామన్నారు. అందులో మొదటి నాలుగు రోజుల షెడ్యుల్ ఉంటుందని తలశిల రఘురామ్ తెలిపారు.