Site icon HashtagU Telugu

CM Jagan Birthday : 600 కిలోల భారీ కేక్ తో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు

Jagan Birdthay

Jagan Birdthay

ఈరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Birthday) పుట్టిన రోజు సందర్బంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుండి నేతలు , కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటూ తమ అభిమాన నేతకు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు.

ఈ క్రమంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. సీఎం పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్యే తలశిల రఘురాం ఆధ్వర్యంలో 600 కిలోల కేక్ ను ట్రాలీపై ఉంచి గొల్లపూడి మైలురాయి సెంటర్ నుంచి భారీ ఊరేరింపుగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సజ్జల ,మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే రఘురాం, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మ, ఎమ్మెల్యే ఎండీ రుహుల్లా, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మన కాళ్ళపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైయ‌స్ రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు ఆయన కుమారుడు వైయ‌స్ జగన్ కే సాధ్యం అని ఆయన చెప్పారు. తండ్రిని మించిన తనయుడిగా వైయ‌స్‌ జగన్ ఎదగటం గర్వ కారణం.. వైయ‌స్ఆర్ కన్న కలలను నిజం చేస్తున్న వ్యక్తి వైయ‌స్ జ‌గన్ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత వైయ‌స్‌ జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకులు వైయ‌స్ జగన్ అని పేర్కొన్నారు.

ఇక ప్రధాని మోడీ (PM Modi) , మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లు సైతం ట్విట్టర్ వేదికగా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

Read Also : Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై పోలీసుల విచారణ