YSRCP Fourth List : వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితా రిలీజ్.. ఐదుగురు సిటింగ్‌లు ఔట్‌

YSRCP Fourth List : 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు.

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 07:45 AM IST

YSRCP Fourth List : 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను ప్రకటించారు.

నాలుగో జాబితా ఇదీ

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్‌): కె.నారాయణస్వామి (ఉప ముఖ్యమంత్రి)

8 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలు వీరే..
1. జీడీ నెల్లూరు (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ):  ఎన్‌ . రెడ్డెప్ప
2.శింగనమల (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ):    ఎం. వీరాంజనేయులు 
3. నందికొట్కూరు (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ):    డాక్టర్‌ సుధీర్‌ దారా 
4. తిరువూరు (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ):   నల్లగట్ల స్వామిదాస్‌ 
5. మడకశిర (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ): ఈర లక్కప్ప 
6. కొవ్వూరు (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ):   తలారి వెంకట్రావు
7. గోపాలపురం (ఎస్సీ రిజర్వ్‌డ్‌ ):  తానేటి వనిత 
8. కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్‌

We’re now on WhatsApp. Click to Join.

నాలుగో జాబితాలో  స్థానం కోల్పోయింది ఎవరంటే ?

తాజాగా నాలుగో జాబితాలో(YSRCP Fourth List)  హోం మంత్రి తానేటి వనితను కొవ్వూరు (ఎస్సీ) నుంచి గోపాలపురం (ఎస్సీ) స్థానానికి బదిలీ చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు ఇన్‌చార్జిగా నియమించారు. ఉపముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు (ఎస్సీ) ఎమ్మెల్యే కె.నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభకు పోటీచేయించనున్నారు. అక్కడి ఎంపీ రెడ్డెప్పను గంగాధర నెల్లూరు (ఎస్సీ) ఇన్‌చార్జిగా నియమించారు. తిరువూరు (ఎస్సీ) ఎమ్మెల్యే రక్షణనిధికి సీఎం జగన్‌ మొండిచేయి చూపారు. ఆయన స్థానంలో ఇటీవలే టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు అవకాశమిచ్చారు. విజయవాడ లోక్‌సభ ఇన్‌చార్జి కేశినేని నాని స్వామిదాసు పేరును సిఫారసు చేశారు. తాజా జాబితాలో టికెట్లు దక్కని సిటింగ్‌లలో జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల-ఎస్సీ), ఆర్థర్‌ (నందికొట్కూరు-ఎస్సీ), బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (కనిగిరి), తిప్పేస్వామి (మడకశిర-ఎస్సీ) కూడా ఉన్నారు. దళితులంటే ప్రభుత్వానికి చులకనంటూ వ్యాఖ్యలు చేసిన శింగనమల (ఎస్సీ) ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని పక్కనపెట్టారు. ఆమె స్థానంలో ఎం.వీరాంజనేయులును ఇన్‌చార్జిగా ప్రకటించారు. నందికొట్కూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్‌ను మార్చాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి పట్టుబట్టడంతో జగన్‌ అంగీకరించారు. ఆయన స్థానంలో డాక్టర్‌ దారా సుధీర్‌ను నియమించారు. తిప్పేస్వామికే మడకశిర (ఎస్సీ) టికెట్‌ ఇవ్వాలని ఆయన అనుచరులు ఇటీవల వెలగపూడి సచివాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘెరావ్‌ చేశారు. దీంతో ఆయనపైనా వేటు పడింది. ఆయన స్థానంలో జక్కప్ప పేరును ప్రకటించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు కూడా టికెట్‌ ఇవ్వలేదు. ఆయన బదులు నారాయణ యాదవ్‌కు అవకాశమిచ్చారు. మొత్తంగా నలుగురు ఎస్సీ ఎమ్మెల్యేలను, ఒక బీసీ ఎమ్మెల్యేలను తప్పించారు.

Also Read: Ram Lalla : రామమందిరం గర్భగుడి నుంచి రామ్‌లల్లా మొదటి ఫొటో..