Site icon HashtagU Telugu

CM Chandrababu : నేడు గుజరాత్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Law College in 100 acres in Amaravati: CM Chandrababu's announcement

Law College in 100 acres in Amaravati: CM Chandrababu's announcement

CM Chandrababu will go to Gujarat today: నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుజరాత్‌ వెళ్లనున్నారు. గాంధీనగర్ లో ఈరోజు నుంచి జరగనున్న జరిగే 4వ గ్లోబల్‌ రెన్యుబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్, ఎక్స్‌పో (Re-Invest 2024) సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు. ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొననున్నారు.

Read Also: Caste Column : ఈసారి జనగణన ఫార్మాట్‌లో ‘కులం’ కాలమ్.. కేంద్రం యోచన

కాగా, నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రెన్యూవబుల్‌ ఎనర్జీ(ఆర్‌ఈ) ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024 జరగనుంది.. అయితే.. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సదస్సు వేదికగా.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కాగా, గుజరాత్‌ పర్యటన కోసం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు చంద్రబాబు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024 గాంధీనగర్‌లో జరగనుంది. ఈ మీట్‌కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. దీంతో.. ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది.

కాగా, మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌కర్‌ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు కూడా పాల్గొననున్నారు.

Read Also: Haryana election: బీజేపీ గెలిస్తే హర్యానా సీఎం నేనే