ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తన ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేసారు. రాష్ట్ర పాలనపై ప్రజల అభిప్రాయాలను గుర్తించేందుకు ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నలుగురు శాసనసభ్యుల పనితీరుపై సమీక్ష (Review) జరిపి వారికి తగిన సూచనలు చేసినట్లు వెల్లడించారు. పార్టీకి లేదా ప్రజలకు ఇబ్బందిగా మారే నేతల విషయంలో తాను ఎవరినైనా వదిలిపెట్టనని, అవసరమైతే “నమస్కారం” చెబుతానంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
Anchor Swetcha Votarkar : తన రెండు కళ్లను దానం చేసిన యాంకర్ స్వేచ్ఛ
“సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం పెంచుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. జూలై 2న ప్రారంభమయ్యే ఈ ప్రచారంలో ప్రభుత్వ పథకాలను ఇంటి దాకా తీసుకెళ్లాలని, సమస్యలను తెలుసుకొని పరిష్కారం చూపాల్సిన బాధ్యత నేతలదే అని తెలిపారు. గతంలో పార్టీ పరాజయం ఎదుర్కోవడానికీ, తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పలేకపోవడమే కారణమని పేర్కొన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన చంద్రబాబు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని, “స్వర్ణ ఆంధ్ర @2047” లక్ష్యాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, మాదక ద్రవ్యాల నివారణకు టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.