Polavaram Project : ఈరోజు (సోమవారం) ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ మేరకు సీఎం అక్కడి పనులను పరిశీలించారు. ఈ సందర్శనలో భాగంగా సీఎం ప్రాజెక్టు పురోగతిని, పునరావాసాన్ని పరిశీలించడానికి అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై పలు కీలక సూచనలిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా, పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై స్పష్టత రావడం అనేక రైతులు, నిర్వాసితులకి ఆశలు కలిగిస్తోంది.
2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా చేపట్టవలసిన పనుల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి త్వరలో వెల్లడించనున్నారు. ఈ ఏడాది జూన్ 17న మొదటిసారి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. తాజాగా మరోసారి పోలవరాన్ని చంద్రబాబు ఈరోజు పరిశీలిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ సందర్శనుసారం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు#CMChandrababu #ChandrababuPolavaramVisit #Polavaram #HashtagU pic.twitter.com/QVsFHgZnXG
— Hashtag U (@HashtaguIn) December 16, 2024
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన వేళ భద్రతా కారణాల రీత్యా పాపికొండల విహార యాత్రలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఈరోజు పాపికొండల విహారయాత్ర కు వెళ్ళే 14 ప్రైవేట్ టూరిజం బోట్లు, ఒక టూరిజం బోటును తాత్కాలికంగా ఆపారు. ఆది, సోమవారాలు పాపికొండల టూరిజంకు తాత్కాలిక విరామం కలిగింది.
ఇకపోతే..2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి సమాచారని సీఎం తెలుసుకునేవారు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మరోసారి నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షలు జరిపి, పలు సూచనలు చేశారు.