CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చెన్నైకి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం చెన్నైలో జరిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ (ఏఐఆర్ఎస్ఎస్)- 2025లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక, చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. మీనంబాక్కంలోని పాత విమానాశ్రయంలో వీఐటీ గేట్ (6వ నెంబరు గేట్) నుంచి చంద్రబాబు బయటకు రానున్నారు.
Read Also: MAD Square : మ్యాడ్ స్క్వేర్ టాక్
కాగా, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలిరావాలని చెన్నై టీడీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు మద్రాస్ ఐఐటీ నుంచి విమానాశ్రయం చేరుకుని, విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.
చెన్నైలో జరుగనున్న ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు ముఖ్యంగా రోడ్డు, రైలు, ఎయిర్‌లైన్ కనెక్టివిటీ, నీటి ప్రవాహం మరియు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై సంభాషించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశం ద్వార ఏపీ, తమిళనాడు మధ్య దృఢమైన సంబంధాలను స్థాపించి, ప్రతిపక్ష రాష్ట్రాలతో సహకారం పెంచాలని చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ-చెన్నై రహదారి అభివృద్ధి, గన్నవరం విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ పెంపు తదితర అంశాలపై కూడా ఈ చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు సమక్షంలో పలు రాష్ట్ర స్థాయి అధికారులను కలిసే అవకాశం ఉంది.
Read Also: US-Canada : ఇక అమెరికాతో పాత సంబంధం ముగిసింది: కెనడా