Site icon HashtagU Telugu

Chandrababu : సీఎం స్థాయిలో ఉండి ఆటోలో ప్రయాణం చేసిన చంద్రబాబు

Cbn Auto

Cbn Auto

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆటోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు ఈరోజు (శుక్రవారం ఆగస్టు 1) పర్యటించారు. గూడెంచెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గూడెంచెరువు గ్రామం నుంచి ప్రజావేదిక వద్దకు ఆటోలో వెళ్లారు. డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం తరఫున ఆటో డ్రైవర్‌కు భరోసా కూడా కల్పించారు. జిల్లా కలెక్టర్‌ను పిలిచి ఆ యువకుడికి ఏ విధంగా సహాయం చేయగలరో పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సామాన్య ప్రజలతో మమేకమవుతూ ఆటోలో ప్రయాణించడం ప్రజల ప్రశంసలు అందుకుంది.

jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం

ఇదే పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాటలను జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రసన్నను జగన్ పరామర్శించడంపై ధ్వజమెత్తుతూ, పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని హితవు పలికారు. నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి, జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే అన్నట్లుగా జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా అని నిలదీశారు.

జగన్ అండ్ కో లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే “తోక కట్ చేస్తానని” హెచ్చరించారు. ఇటీవల బంగారుపాళ్యంలో జగన్ పర్యటన దృశ్యాలను నెల్లూరులో ఆయన పర్యటనకు వచ్చినట్లుగా చూపించారని విమర్శించారు. వితండవాదం చేయడంలో వైసీపీ నేతలు ఎప్పుడూ ముందుంటారని ఆరోపించారు. ప్రతి చోటా డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని, తస్మాత్ జాగ్రత్త అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.