Site icon HashtagU Telugu

Chandrababu : శాంతి భద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu released a White Paper Law And Order

CM Chandrababu released a White Paper Law And Order

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివిధ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ మేరకు సీఎం శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించారు, రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని ఆయన విమర్శలు గుప్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ హయాంలో కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. తమ మాట వినని పోలీసులను వెకెన్సీ రిజర్వ్‌కు గత ప్రభుత్వం పంపించిందని.. ఐదేళ్లూ వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులూ ఉన్నారని చంద్రబాబు తెలిపారు. తన మీద చిన్నప్పటి నుంచి ఒక్క కేసు కూడా లేదని.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చెప్పారు. పవన్ రోడ్ మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారని.. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారని.. ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Peddireddy : బిజెపిలోకి పెద్దిరెడ్డి..?

ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారని.. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారని.. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారని సీఎం చంద్రబాబు  ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. ప్రస్తుత హోం మంత్రి అనిత మీద, కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పారు. అయ్యన్న మీద అత్యాచారం చేయబోయారనే కేసు పెట్టడం సిగ్గు చేటన్నారు. పైల్స్ ఆపరేషన్ చేయించకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నని 600 కిలో మీటర్లు తిప్పారని మండిపడ్డారు. రఘురామకృష్ణం రాజును జైల్లో పెట్టి కొడుతుంటే.. ఆనాటి సీఎం ఫోన్లో చూసి ఆనందించారని ఆగ్రహించారు. రఘు రామకృష్ణం రాజును తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. ప్రధాని తన నియోజకవర్గానికి వచ్చినా రఘురామ వెళ్లలేకపోయారని వాపోయారు. తాను అమరావతి పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారన్న సీఎం చంద్రబాబు.. అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛ అని నాటి డీజీపీ కామెంట్ చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

Read Also: Mobile Spam Menace : అభిప్రాయ సమర్పణ గడువును పొడిగించిన కేంద్రం