Site icon HashtagU Telugu

Chandrababu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు: చంద్రబాబు

Cr Chandrababu11zon

Chandrababu

Chandrababu: జూలై 23న బీజేపీ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశాపెట్టనుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది తొలి బడ్జెట్ కావడం విశేషం. బడ్జెట్ విషయంలో బీజేపీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ఎన్నికల హామీలో భాగంగా బడ్జెట్ ను రూపొందించనున్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఆంధ్రపప్రదేశ్ కి అత్యంత ప్రాధాన్యతా ఇచ్చే అంశం చర్చకు వస్తుంది. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగం కావడంతో, పైగా చంద్రబాబు సీఎంగా ఉండటంతో మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధుల కేటాయింపు కోసం తన వాదనను వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు. దేశ రాజధానికి రెండు రోజుల పర్యటనలో ఉన్న నాయుడు మంగళవారం హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధుల వాటా అంశంపై ఆయన చర్చించారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వినాశకరమైన పరిస్థితిని ఎదుర్కొందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో నిధుల కొరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జీని కలిశాను. 2019-24 ఆర్థిక సంవత్సరానికి మధ్య రాష్ట్ర అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల ఫలితాలను కూడా చర్చించానని చంద్రబాబు అన్నారు. అన్యాయమైన విభజన, మరియు గత ప్రభుత్వ దయనీయమైన పాలన గురించి చర్చించారు.

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు అధిక నిధులు కేటాయించాలని కోరుతూ సోమవారం ఆర్థిక మంత్రిని కలిసిన జెడి(యు) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విధమైన చర్యను అనుసరించి నిధుల పెంపు కోసం చంద్రబాబు ఢిల్లీలో వాదించారు. టీడీపీ మరియు జెడియు రెండూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో కీలక భాగస్వాములు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో 2024-25 కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ కోసం తమ కూటమిని ఉపయోగించుకోవాలని ఆసక్తిగా ఉన్నాయి.

Also Read: Monsoon Travel : పైనుంచి వర్షం.. ఆకర్షించే పర్వత శ్రేణులు.. మైమరపించే ప్రకృతి ప్రయాణం చేయాల్సిందే..!

Exit mobile version