అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం(Kailasapatnam )లో జరిగిన బాణసంచా తయారీ కేంద్ర అగ్నిప్రమాదం (Explosion ) రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి తానేటి వనితలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు.
Vanajeevi Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వనజీవి అంత్యక్రియలు
ప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారన్నదానిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో వారిని వెంటనే సమీప మెడికల్ సెంటర్లకు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని, వారి బాధలో ప్రభుత్వం తాము కలిసి ఉందని సీఎం అన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి పూర్తి నివేదికను తక్షణమే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నిరంతరం అప్‌డేట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా ప్రమాణాలను పరిశీలించి, రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.