CM Chandrababu : ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన ‘స్వర్ణ కుప్పం’ పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకంలో వచ్చే ఐదేళ్లలో కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం సరికొత్త ప్రణాళికలు రూపొందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమికి కారణాలు ఇవేనా?
పర్యటనలో భాగంగా, సోమవారం కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్‌ను సీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా, కుప్పంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు కొత్త డైరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారికంగా ప్రకటించారు.
అలాగే, కుప్పం నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ‘స్వర్ణ కుప్పం’ పథకంలో భాగంగా సోమవారం నడిమూరు గ్రామంలో గృహాలపై సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ఇంకా, సీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమం కింద ప్రకృతి సేద్యం రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ పర్యటన అనంతరం, జనవరి 8వ తేదీ నాడు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్టణానికి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.