Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!

ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా, ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని, అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని వివరించారు.

Published By: HashtagU Telugu Desk
Annadata Sukhibhava

Annadata Sukhibhava

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు 2025 సందర్భంగా కడపలోని సీకే దిన్నెలో జరిగిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహాసభలో అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంతో సమన్వయం చేస్తూ కేంద్రం నుంచి రూ.6 వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14 వేలు అందించనున్నట్లు సీఎం వెల్లడించారు.

పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేల విడతను విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రం తన వాటాగా రూ.5 వేలు జమ చేస్తుందని, దీంతో రైతులకు ఒక్కో విడతలో రూ.7 వేలు, మొత్తంగా ఏడాదికి రూ.20 వేలు అందుతుందని తెలిపారు. 2025 మేలో పీఎం కిసాన్ తొలి విడత నిధులు విడుదలైతే, అదే సమయంలో రాష్ట్రం కూడా తన వాటాను విడుదల చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమన్వయ విధానం రైతులకు గణనీయమైన ఆర్థిక ఊతం ఇస్తుందని, వ్యవసాయ ఖర్చులను భరించడంతో పాటు విత్తనాలు, ఎరువులు, సహజ విపత్తుల నష్ట పరిహారం వంటి సౌకర్యాలను అందిస్తుందని పేర్కొన్నారు.

Also Read: Rishabh Pant: ఐపీఎల్‌లో 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత పంత్ సెంచ‌రీ.. వీడియో వైర‌ల్!

ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా, ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని, అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని వివరించారు. పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల్లో నమోదైన రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చని సూచించారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ పథకం రైతులకు ఆర్థిక స్థిరత్వం, వ్యవసాయంలో ఆధునికీకరణకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి: https://annadathasukhibhava.ap.gov.in/know-your-status

 

  Last Updated: 27 May 2025, 10:09 PM IST