Site icon HashtagU Telugu

CM Chandrababu : గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం

CM Chandrababu meet with Governor Abdul Nazir

CM Chandrababu meet with Governor Abdul Nazir

Chandrababu meet Abdul Nazeer: విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీలో… సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రంలోని వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గవర్నర్ కు వివరించారు.

వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ..

వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించిందని, రాత్రింబవళ్లు నిరంతరం పనిచేసి భారీ స్థాయిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్టు గవర్నర్ కు తెలియజేశారు. భారీ వర్షాలు వరదల కారణంగా రూ.6,880 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ వివరాలను చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వివరించారు. డబ్బు ఎంత ఖర్చు అవుతుందనే కంటే, ఎంత మందికి ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని చంద్రబాబు అన్నారు. రూ.6880 కోట్ల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రాథమిక నివేదిక పంపామని ఆయన వెల్లడించారు.

చంద్రబాబును అభినందించిన గవర్నర్‌..

కాగా, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలను అబ్దుల్ నజీర్ అభినందిన్నట్లు సమాచారం. అతి త్వరలో రాష్ట్రం, విజయవాడ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Don’t Brush Your Teeth: ఈ మూడు ప‌నులు చేసిన త‌ర్వాత ప‌ళ్లు తోముకోకూడ‌దు..!