ఏపీలో మిర్చి (Mirchi) ఘాటు రాజకీయం మొదలైంది. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వైసీపీ అధినేత జగన్ (Jagan) డిమాండ్ కు దిగాడు. అంతకు ముందే మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలోని మిర్చి రైతుల పరిస్థితిని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)కు చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మిర్చిని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని కోరారు.
Kumari Aunty : రేవంత్ ఫోటో తో మరోసారి కుమారి ఆంటీ వైరల్
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంటను వెంటనే కొనుగోలు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఏపీలో మిర్చి రైతుల పరిస్థితిని లేఖలో వివరించిన చంద్రబాబు.. మార్కెట్‌లో ధరల పతనంపై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద 50 శాతం కాకుండా పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని చంద్రబాబు కోరారు. ఏపీలో ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగిందన్న సీఎం చంద్రబాబు.. గతేడాది క్వింటాల్ 20 వేలు పలికిన వెరైటీ మిర్చి, ఇప్పుడు 13 వేలకు పడిపోయిందన్నారు. సాధారణ రకం మిర్చి ఏకంగా 11 వేలకు దిగజారిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. విదేశాలకు మిర్చి ఎగుమతి తగ్గడం వలన ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ధరల పతనంతో మిర్చి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కొనుగోళ్లు ప్రారంభించాలని చంద్రబాబు లేఖలో కోరారు.
BSNL : బీఎస్‌ఎన్‌ఎలా మజాకా..సిమ్ కార్డు లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు
మరోవైపు మిర్చి ధరలు పడిపోవటంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం గుంటూరు మిర్చి యార్డును బుధవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, సీఎం వెంటనే గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలబడాలని, వారి పంటను కొనుగోలు చేయాలని జగన్ కోరారు.