CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇదని ఆయన పేర్కొన్నారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నామని చెప్పారు.
తెలుగు ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి…
— N Chandrababu Naidu (@ncbn) October 30, 2024
తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్ల ను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యమన్నారు. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే ‘దీపం 2.0’ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది సంతోషం కలిగించే విషయమని, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే స్ఫూర్తిని పొందుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల జీవితంలో ఈ ఆనంద దీపావళి కొత్త వెలుగు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.