Site icon HashtagU Telugu

Amaravati Relaunch : ప్రధాన మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం చంద్రబాబు

Modi Sendhaf

Modi Sendhaf

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించి (Amaravati Relaunch) తిరుగు ప్రయాణమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)కి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 06:07 గంటలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 06:44 గంటలకు భారత ప్రధాని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Hyundai Motor India : మూడు మిలియన్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా

రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖ, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని), బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంత రాము, పోలీసు జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిజి అంజనీ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, బిజెపి జిల్లా ప్రెసిడెంట్ పీక్కి నాగేంద్ర, బిజెపి మాజీ విస్తారక్ పొనంగి సంతోష్ పవన్, కొవ్వూరు అసెంబ్లీ బిజెపి కన్వీనర్ మాట్లా వీరాంజనేయులు, బిజెపి సీనియర్ కార్యకర్త పెనుమాక శేషగిరిరావు, పశ్చిమగోదావరి బిజెపి జిల్లా ప్రెసిడెంట్ ఐ శ్రీదేవి, పశ్చిమగోదావరి జిల్లా జనరల్ సెక్రెటరీ పులపర్తి వెంకటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీలు అల్లూరి సాయి దుర్గరాజు, కోమటి రవికుమార్, జిల్లా ప్రెసిడెంట్ సిహెచ్ విక్రమ్ కిషోర్, బిజెపి జిల్లా జనరల్ సెక్రటరీలు నగరపాటి వెంకట సత్యనారాయణ, కోటప్రోలు నాగ వెంకట కృష్ణారావు, నడపన ధన భాస్కరరావు, కట్ట సత్యనారాయణ ప్రధానమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు.

భారత ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.