తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి, మాజీ మంత్రి జోగి రమేష్‌కు సీఐడీ (CID) అధికారులు మరోసారి నోటీసులు (Notice) జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరైన జోగి రమేష్‌కు తాజా నోటీసుల్లో ఈ నెల 11న విచారణకు రావాలని ఆదేశించారు. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టం చేశారు.
Mark Shankar Health : పవన్ కళ్యాణ్ కుమారుడి కోసం అఘోరి ప్రత్యేక పూజలు
ఈ కేసులో కీలక అభియోగాలు నమోదవడంతో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించేందుకు సీఐడీ అధికారులు ముందుకొస్తున్నారు. జోగి రమేష్‌ను మరోసారి విచారించేందుకు, కేసులో ఉన్న ఖాళీలను పూరించేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో మూడు సార్లు విచారణకు హాజరైనప్పటికీ, ఇప్పటికీ కొన్ని కీలక వివరాలు తెలియాల్సి ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో జోగి రమేష్ హాజరై సమగ్రంగా వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కేసులో మరింత మందిని విచారించే అవకాశం ఉందని, దర్యాప్తు తుది దశకు చేరుకుంటుందని సమాచారం. అధికారుల నోటీసులకు ఆయన స్పందన ఎలా ఉంటుందో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.