Site icon HashtagU Telugu

CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

CID notice to Vijayasai Reddy once again

CID notice to Vijayasai Reddy once again

CID Notice : మరోసారి సీఐడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మళ్లీ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో గత బుధవారం విచారణకు సీఐడీ అధికారులు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.

Read Also: Araku Coffee Stall : అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

కేవీరావు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ విచారణ జరుపుతోంది. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై కేవీరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. అయితే తనకేమీ సంబంధం లేదని ఈ కేసులో కర్త , కర్మ క్రియ అంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని విజయసాయిరెడ్డి సీఐడీకి చెప్పారు. ఈ కేసులో ఆయన వద్ద నుంచి మరింత సమాచారం తీసుకోవడం కోసం నోటీసులు జారీ చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో అత్యంత భారీ స్కాంగా ప్రచారం జరుగుతున్న లిక్కర్ స్కాం విషయంోలనూ ఆయన గత విచారణ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కూడా కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి అని చెప్పారు.

కాగా, విజయసాయిరెడ్డి వైసీపీతో విబేధించిన తర్వాత విచారణలకు హాజరవుతున్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని చెబుతున్నా ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జగన్ చుట్టూ ఉండే కోటరీ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సీఐడీ వరుసగా విచారణలకు పిలుస్తూండటం సంచలనంగా మారింది. ఇక, విజయసాయిరెడ్డి ఒక వేళ లిక్కర్ స్కాంలో తనకు తెలిసినవన్నీ సీఐడీకి చెబితే సంచలనాత్మక స్టేట్ మెంట్ అవుతుంది. ఇప్పటికే సీఐడీ కీలక విషయాలను దర్యాప్తులో కనిపెట్టిందన్న ప్రచారం జరుగుతోంది.

Read Also: Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ