AP News : 18 నెలల బాలుడిపై పైశాచిక దాడి.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి చిత్ర హింసలు..

AP News : చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కేవలం 18 నెలల పసిబిడ్డపై పైశాచికంగా దాడి చేసిన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.

Published By: HashtagU Telugu Desk
Shocking

Shocking

AP News : చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కేవలం 18 నెలల పసిబిడ్డపై పైశాచికంగా దాడి చేసిన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గంగవరం మండలం వత్తికొండలో ఓ కోళ్ల ఫారంలో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ దంపతులు పని చేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి ఉన్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే, ఆ రోజు కూడా తల్లిదండ్రులు పనిమీద వెళ్లే సమయంలో పక్కింటి 13 ఏళ్ల బాలుడిని నమ్మి తమ కుమారుడిని వదిలారు. కానీ ఆ బాలుడే అమాయక పసిబిడ్డపై ఊహించలేని రీతిలో దాడికి పాల్పడ్డాడు. చిన్నారిని కొట్టడమే కాకుండా శరీరంలోని మర్మాంగాలపై, ఇతర భాగాలపై విచక్షణారహితంగా కొరికి గాయాలు చేశాడు.

ED Raids : ఆప్‌ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

తరువాత ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి పరిస్థితి గమనించి తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే బాలుడిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, కోమాలోకి వెళ్లిపోయాడని తెలిపారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఈ ఘటనను పరిశీలించగా, ఇది సహజంగా వచ్చిన వ్యాధి కాదని, ఎవరో చిన్నారిని తీవ్రంగా హింసించారని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ మాదేశ్ బృందం ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారిక ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పలమనేరు పోలీసులు 13 ఏళ్ల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఊహించలేనిదని, దానికి తగిన శిక్ష తప్పదని వారు డిమాండ్ చేస్తున్నారు.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ కోసమే బ్రాంకో టెస్ట్.. మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  Last Updated: 26 Aug 2025, 11:06 AM IST