Site icon HashtagU Telugu

MLC Nagababu : తమ్ముడిని సన్మానించిన అన్నయ్య

Chiru Nagababu

Chiru Nagababu

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Nagababu) ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడి(MLC)గా ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తరఫున పోటీ చేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో నాగబాబు ప్రమాణం చేసి, తన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి (CHiranjeevi), తన తమ్ముడికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే అన్నీ.. ఫ్యూచర్‌లోనూ అవన్నీ

ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు తన అన్న చిరంజీవి, వదిన సురేఖ ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి దంపతులు పూల మాల వేసి నాగబాబును సన్మానించారు. అంతేకాదు ఓ ఖరీదైన పెన్నును చిరు తమ్ముడికి కానుకగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో “తమ్ముడు నాగబాబుకి అభినందనలు, ప్రజా సేవలో విజయాలు సాధించాలి” అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. చిరు భార్య సురేఖ గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఆయనకు ఖరీదైన పెన్ కానుకగా ఇచ్చారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయగానే, అదే విధంగా చిరు, సురేఖ ఆశీర్వాదం అందించారు.