Posani : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నాడు – పోసాని కృష్ణమురళి

ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 08:15 PM IST

ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) తారాస్థాయిలో ఉండగా …సినీ నటుడు , వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ..మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫై కీలక ఆరోపణలు చేసి మెగా అభిమానుల్లో (Mega Fans) , జనసేన శ్రేణుల్లో ఆగ్రహం నింపారు. మెగాస్టార్ గా చిత్రసీమలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన..ప్రజారాజ్యం పేరుతో 2008 లో పార్టీని స్థాపించి..2009 లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది ప్రజారాజ్యం (Praja Rajyam Party). మొత్తం ఓట్లలో 18% ఓట్లు పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆ తర్వాత ఆగష్టు 2011 లో కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసారు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉండగా..తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసారు. కూటమి అభ్యర్థులకు తన మద్దతును తెలియజేస్తున్నట్లు తెలుపడంతో..వైసీపీ నేతలు చిరంజీవి ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించగా..తాజాగా పోసాని కృష్ణ మురళి ..చిరంజీవి ఫై సంచలన ఆరోపణలు చేసారు.

చిరంజీవి వల్ల ఏపీలో కాపులంతా ఇబ్బంది పడ్డారని.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోను కాపుల మనోభావాలను పట్టించుకోలేదని, ప్రజారాజ్యం పార్టీ నీటి బుడగలాగా పేలి పోయిందని కీలక వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు . చిరంజీవి దెబ్బకు రాష్ట్రంలోని కాపులు ఆస్తిని కోల్పోయి రోడ్డున పడ్డారని, చిరంజీవి మాత్రం రాజ్యసభ సీటు మంత్రి పదవి తీసుకుని హ్యాపీగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు పోసాని ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Hyderabad: హైదరాబాద్ లో బ్యూటీ క్లినిక్ లపై దాడులు, నోటీసులు జారీ