Site icon HashtagU Telugu

Chiranjeevi Meets Venkaiah Naidu : ఇద్దరు పద్మ విభూషన్లు కలిసిన వేళ..మెగా పిక్ అదిరి పోలే..

Chiru Venkyya

Chiru Venkyya

రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్రం పద్మ అవార్డ్స్ (2024 Padma Awards) ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) కి ,మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కి పద్మ విభూషన్ (Padma Vibhushan) ను ప్రకటించింది. ఇద్దరు తెలుగు వారికీ పద్మ విభూషన్లు రావడం పట్ల యావత్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పద్మ విభూషన్ రావడం పట్ల ఇరువురు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేసారు.

ఈ క్రమంలో వెంకయ్య నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. పద్మ విభూషన్ పురస్కారం రావడంతో స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు కూడా చిరంజీవికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాసేపు సరదాగా మాట్లాడుకొని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీవి, ఈ పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరూ ఇరువురికి ఉన్న గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు . ఈ సన్మానాలకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు’ అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను సినిమాలలోకి వచ్చానని.. ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారయని మెగాస్టార్ చిరంజీవి‌ పేర్కొన్నారు.

కొద్దికాలం తర్వాత మేమిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నాం. అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని. సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని చిరంజీవి వెల్లడించారు. వెంకయ్యనాయుడు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని.. ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. వెంకయ్యనాయుడుతో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్‌ రావటంతో తన ఆనందం ద్విగిణికృతమయిందన్నారు. ఇద్దరు తెలుగువాళ్లం.. స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం’ అని చిరంజీవి తన ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం రావడంపై సినీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌బాబు, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్, రవితేజ, దర్శకులు కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, సుకుమార్‌, గుణశేఖర్‌, కె.ఎస్‌.రవీంద్ర, గోపీచంద్‌ మలినేని, మారుతి, ప్రశాంత్ వర్మ తదితరులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : Jagan Siddam : జగన్ ‘సిద్ధం ‘..ఇంటికి పంపడానికి జనం కూడా ‘సిద్ధం’