Site icon HashtagU Telugu

Chiranjeevi: సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరంజీవి విరాళం.. మొత్తాన్ని వింటే ఆశ్చర్యమే..!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రజా సేవల పట్ల ఎప్పుడూ ముందుండే ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) భారీ విరాళాన్ని అందించారు. మొత్తం రూ.1 కోటి రూపాయల చెక్కును స్వయంగా సీఎం చంద్రబాబుని కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రత్యేకంగా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడానికి ఈ నిధి ఉపయోగపడుతుందని చిరంజీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. “ఇలాంటి సమయాల్లో మనం చేయగలిగిన సహాయం బాధితులకు ఉపశమనం ఇస్తుంది. ఈ విరాళం ద్వారా కొంతమేరకు ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.

Free Smart Rice Cards: ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. రేప‌టి నుంచి స్టార్ట్‌!

మెగాస్టార్ చూపిన సామాజిక బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు. “చిరంజీవి ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ప్రజల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయం. ఈ విరాళం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది” అని సీఎం పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు “చిరు నిజమైన హీరో”, “సినిమాల్లో మాత్రమే కాదు.. జీవితంలో కూడా సేవామూర్తి” అంటూ మెగాస్టార్ సేవాగుణాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన పలు సామాజిక సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి ప్రాణాధారంగా నిలిచారు. వివిధ విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఆయన చేసిన సహాయాలు, విరాళాలు సమాజంలో విశేషంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సీఎం సహాయ నిధికి అందించిన ఈ విరాళం ఆయనకు ఉన్న ప్రజాసంక్షేమ నిబద్ధతకు మరో నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Revanth Meets Film Celebrities: తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. నిర్మాత‌ల‌కు ప‌లు సూచ‌న‌లు!