Site icon HashtagU Telugu

Amanchi Swamulu : చీరాలలో YSRCPకి దెబ్బ.. మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనలోకి.. నెలాఖరులో ముహూర్తం..

Chirala Ex MLA Brother Amanchi Swamulu joining in Janasena

Chirala Ex MLA Brother Amanchi Swamulu joining in Janasena

చీరాల(Chirala) మాజీ ఎమ్మెల్యే, YSRCP నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్(Amanchi Krishna Mohan) గత ఎన్నికల్లో TDP మీద ఓడిపోయాడు. ప్రస్తుతం చీరాల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ గానే కొనసాగుతున్నాడు. ఈ సారి వచ్చే ఎన్నికల్లో కూడా YSRCP టికెట్ తనకే వస్తుందని ఆమంచి కృష్ణ మోహన్ భావిస్తున్నాడు. ఈ సమయంలో చీరాలలో YSRCP కి గట్టి దెబ్బ తగలనుంది.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు(Amanchi Swamulu) ఇటీవల జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను హైదరాబాద్ లోని తన నివాసంలో కలిశాడు. పుష్ప గుచ్చం అందచేసి పవన్ తో కాసేపు మీటింగ్ అయ్యారు.ఈ నేపథ్యంలో జనసేనలోకి ఆమంచి స్వాములు చేరబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ తో మీటింగ్ అనంతరం తాజాగా నాగబాబు, నాదేండ్ల మనోహర్ ను కూడా కలిసి స్వాములు, ఆయన కుమారుడు రాజేంద్ర కలిశారు. జనసేన పార్టికి తన అవసరమేరకు పని చేస్తానని పవన్ కు తెలిపాడు. ఈ నెల ఆఖరులో ఆమంచి స్వాములు జనసేన తీర్దం పుచ్చుకొనున్నట్లు సమాచారం.

ఇప్పటికే చీరాలలో ఆమంచి స్వాములు జనసేన, పవన్ తో ఉన్న బ్యానర్లు ఏర్పాటు చేయడంతో చీరాలలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. చీరాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఆమంచి స్వాములుని ప్రకటించే అవకాశం ఉంది. YSRCP మాజీ ఎమ్మెల్యే సొంత తమ్ముడు జనసేనకు వెళ్లిపోవడంతో క్యాడర్ కూడా డివైడ్ అయ్యింది. ప్రస్తుతం TDP అక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడు ఇలా జగడంతో వచ్చే సారి కూడా YSRCP చీరాలలో సీటు సంపాదించడం కష్టమే.

 

Also Read : Yuvagalam Padayatra : డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీడీపీ యువగళం జెండాలు..