Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవిని గెలిపించే బాధ్యత మాదే అంటున్న చింతామోహన్‌

Chinthamohan Chiru

Chinthamohan Chiru

చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి (Chiranjeevi)..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం (Prajarajyam) పేరుతో పార్టీ పెట్టి..ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి..ఇక రాజకీయాలు వద్దురా బాబు అని..మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాల ప్రస్తావన వస్తే అది బురద అంటూ చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే పలుమార్లు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పుకొచ్చిన మోహన్..మరోసారి తన మనసులోని మాటలు బయటకు తీశారు. ముఖ్యమంత్రి అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న ఆయన.. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, చిరంజీవి ఇప్పుడు రాకపోతే పదేళ్ల పాటు కాపులు, బలిజలకు ఏ అవకాశం రాదు అని చెప్పుకొచ్చారు.

త్వరలోనే తిరుపతి రాజధాని అవుతుందని ,. ప్రజలు కూడా తిరుపతి రాజధాని అయితే బాగుంటుందని కోరుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీమలో కరువు పోయి అభివృద్ధి జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యం అన్నారు. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారు.. అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. తిరుపతి అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం.. భూములు, వనరులు, ఆహ్లాదకర మైన వాతావరణం అన్నీ ఉన్నాయని వెల్లడించారు.

Read Also : Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్