ఆంధ్రప్రదేశ్(AP)లో బర్డ్ ఫ్లూ (Birdflu ) వైరస్ బారినపడి ఓ చిన్నారి మరణించిన (Child dies) ఘటన కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో మరణించింది. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా ప్రాణం పోవడం ఇదే మొదటిసారి. మార్చి 4న అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మార్చి 16న ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి స్వాబ్ నమూనాలను పరీక్షించగా, అవి బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది.
Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక తల్లిదండ్రులు వెల్లడించారు. వారి మాటల్లో చిన్నారి చికెన్ మాంసం కోసం అడిగినప్పుడు, కోడిని కోసిన సమయంలో ఒక ముక్క ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం విషమించి జ్వరంతో బాధపడింది. మొదట స్థానికంగా చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారని తెలిపారు. వైద్యులు బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేసి, నమూనాలను పరీక్షించగా చివరకు ఈ వైరస్ కారణంగానే మృతి చెందినట్లు తేలింది.
Waqf Bill : వక్స్ చట్ట సవరణతో రాబోయే మార్పులు ఇవే..!
ఈ ఘటనతో రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయం పెరిగింది. అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై ప్రజలను హెచ్చరించింది. పశుసంవర్థక శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కోడి పక్షుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ మాంసాన్ని తినే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని, పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.