Chikoti praveen : గుడివాడ కు గ్యాంబ్లింగ్ బుర‌ద‌ ! థాయ్ లాండ్ లో `చిక్కోటి` బ్లాస్ట్ !

క్యాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ (Chikoti praveen) అండ్ గ్యాంగ్ థాయ్ ల్యాండ్ పోలీసుల‌కు చిక్కారు. సుమారు 100కోట్ల లావాదేవీలతో దొరికారు.

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 03:46 PM IST

క్యాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ (Chikoti praveen) అండ్ గ్యాంగ్ థాయ్ ల్యాండ్ పోలీసుల‌కు చిక్కారు. సుమారు 100కోట్ల లావాదేవీల గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికారు. హ‌వాలా కేసులో ఏ1గా ఉన్న చిక్కోటి థాయ లాండ్(Thailand) కేంద్రంగా న‌డిపిన గ్యాంబ్లింగ్ మాజీ మంత్రి కొడాలి నాని(kodali nani), ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి (Vallabhaneni Vamsi) చుట్టూ తిరుగుతోంది. వాళ్ల ప్రోద్బ‌లంతోనే చిక్కోటి చీక‌టి వ్యాపారం న‌డుపుతున్నాడ‌ని టీడీపీ ఆరోపిస్తోంది. థాయ్ లాండ్ పోలీసులకు చిక్కోటి దొరికిన వెంట‌నే టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాభి మీడియా ముందుకొచ్చారు. థాయ్ లాండ్ గ్యాంబ్లింగ్ ఎపిసోడ్ ను కొడాలి, వ‌ల్ల‌భ‌నేనికి చుట్టేశారు.

థాయ్ లాండ్ గ్యాంబ్లింగ్ ఎపిసోడ్  కొడాలి, వ‌ల్ల‌భ‌నేనికి..(Chikoti praveen)

గ‌త ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా గుడివాడ కేంద్రంగా క్యాసినో నిర్వ‌హించారు. గోవా బ్యాచ్ అక్క‌డ క్యాసినో ఏర్పాటు చేసింది. అందుకు మాజీ మంత్రి కొడాలి, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని స‌హ‌కారం అందించారు. క్యాసినోకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ రోజు హ‌ల్ చ‌ల్ చేశాయి. ప‌లు విధాలుగా టీడీపీ వాళ్లిద్ద‌రి మీద ఆరోప‌ణ‌లు చేసింది. ఫ‌లితంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ మీడియా ముందుకొచ్చారు. త‌న స్నేహితుడు కొడాలికి ఏ మాత్రం సంబంధం లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క్యాసినో ఆడ‌డాన్ని పెద్ద‌గా త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్న రీతిలో ఆ రోజున వంశీ మాట్లాడారు. గ్యాంబ్లింగ్ ఏర్పాట్లు సంక్రాంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విష‌యాన్ని సూటిగా అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ గుడివాడ కేంద్రంగా (Chikoti praveen) కొన్ని కోట్ల గ్యాంబ్లింగ్ న‌డిచింది. ఆ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఏపీ పోలీసులు త‌ల‌వంపును భ‌రించారు. సీన్ క‌ట్ చేస్తే, కొడాలి నాని మంత్రి ప‌ద‌వి ఊడిపోయింది.

ఈడీ విచార‌ణ చేసిన సంద‌ర్భంగా హ‌వాలా

ఆ రోజు నుంచి గ్యాంబ్లింగ్ ఎక్క‌డ జ‌రిగిన‌ప్ప‌టికీ ఏదో త‌ర‌హాలో కొడాలి, వ‌ల్ల‌భ‌నేనికి చుట్టుకుంటోంది. పైగా చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్(Chikoti praveen) ను ఈడీ విచార‌ణ చేసిన సంద‌ర్భంగా హ‌వాలా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన్లోనూ కొడాలి, వ‌ల్ల‌భ‌నేని పాత్ర ఉంద‌ని టీడీపీ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. ప్ర‌త్యేక విమానంలో వైసీపీ, బీఆర్ ఎస్ కు చెందిన లీడ‌ర్ల‌ను థాయ్ లాండ్ (Thailand), హాంకాంగ్ తీసుకెళ్లార‌ని అప్ప‌ట్లో చేసిన ఆరోప‌ణ‌లు. దానిపై ఎక్క‌డా విచార‌ణ స‌క్ర‌మంగా జ‌ర‌గలేదు. ఇప్పుడు థాయ్ లాండ్ పోలీసులు చిక్కోటి ప్ర‌వీణ్ అండ్ టీమ్ ను ప‌ట్టుకోవ‌డంతో వ‌ల్ల‌భ‌నేని, కొడాలి వ్య‌వ‌హారాన్ని టీడీపీ తెర‌మీద‌కు తీసుకొచ్చింది. గ‌డ్డం గ్యాంగ్ థాయ్ లాండ్ లో చిక్కింద‌ని టీడీపీ చెబుతోంది. మూడేళ్ల పాటు జైలు శిక్ష ఖాయ‌మ‌ని అంటోంది.

చీకటి రాజ్యంలోని పారిశ్రామివేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు, సినిమా పెద్ద‌లు

సుమారు 20కోట్ల విలువైన గ్యాబ్లింగ్ చిప్ ల‌ను థాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, సుమారు 100 కోట్ల హ‌వాలాను గుర్తించింద‌ని తెలుస్తోంది. గ్యాంబ్లింగ్ ముఠాలో 80 మంది భార‌తీయులు ప‌ట్టుబ‌డ్డారు. ఇంత మంది భారతీయులు విదేశాల్లో గ్యాంబ్లింగ్ ఆడుతూ ప‌ట్టుప‌డ‌డం ఇదే బ‌హుశా ప్ర‌థమం. అందుకే, ఈ కేసును చాలా సీరియ‌స్ గా భార‌త ప్ర‌భుత్వం కూడా తీసుకుంటోంది. ఈ దెబ్బ‌తో చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్(Chikoti praveen) చీకటి రాజ్యంలోని పారిశ్రామివేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు, సినిమా పెద్ద‌లు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఒక‌రు ఉన్న‌ట్టు థాయ్ (Thailand)నుంచి వ‌చ్చిన ఫోటోల ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల ఈడీ న‌మోదు చేసిన కేసులో ఏ1గా ఉన్న మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఈ గ్యాంగ్ లో ఉన్నారు.

Also Read : Chikoti Praveen: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చీకోటి, 93 మంది అరెస్ట్

థాయ్ (Thailand)మ‌హిళ‌తో క‌లిసి గ్యాంబ్లింగ్ నెట్ వ‌ర్క్ ను చిక్కోటి ప్ర‌వీణ్ (Chikoti praveen) క్రియేట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన గ్యాంబ్ల‌ర్ల‌ను ఆక‌ర్షించాడు. వాళ్లంద‌రికీ థాయ్ లాండ్ లోని విలాస‌వంత‌మైన ఆసియా ప‌ట్టాయా హోట‌ల్ ను బుక్ చేశారు. గ్యాంబ్లింగ్ ఆడేందుకు ఒక పెద్ద హాల్ ను హోట‌ల్ లో బుక్ చేశాడు. కొద్ది గంట‌ల్లో తిరిగి భార‌త‌దేశానికి వ‌స్తోన్న స‌మ‌యంలో థాయ్ పోలీసులు వాళ్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్ లు, 100కోట్ల హ‌వాల‌కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను సేక‌రించారు. అయితే, ప‌ట్టుబ‌డిన 80 మందిలో మ‌హిళ‌లు కూడా ఉన్నారు. పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖుల కుటుంబీకులు ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ మొత్తం నెట్ వ‌ర్క్ వెనుక చిక్కోటి ప్ర‌వీణ్ తో పాటు మాజీ మంత్రి కొడాలి(Kodali nani) ఆయ‌న స్నేహితుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ (Vallbhaneni Vamsi) కూడా పాత్ర కూడా ఉంటుంద‌ని టీడీపీ అనుమానం. అందుకే, వాళ్లిద్ద‌ర్నీ టార్గెట్ గా చేసుకుని థాయ్ లాండ్ గ్యాంబ్లింగ్ వ్య‌వ‌హారాన్ని చూస్తోంది.

Also Read : Chikoti Praveen : చిక్కోటి కేసు కీల‌క మ‌లుపు, ఆ ఎమ్మెల్యేల‌కు నోటీసులు

తెలంగాణ‌కు చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌కు అప్ప‌ట్లో ఈడీ నోటీసులు ఇచ్చింది. విచార‌ణ సంద‌ర్భంగా చిక్కోటి ప్ర‌వీణ్ (Chikoti praveen) నుంచి ఈడీ కీల‌క ఆధారాల‌ను హ‌వాలా గురించి తెలుసుకుంది. మంత్రి మ‌ల్లారెడ్డి పేరు అప్ప‌ట్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ‌కు చెందిన కొంద‌రు. ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు హ‌వాలా, గ్యాంబ్లింగ్ వ్య‌వ‌హారంపై బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. అయితే, ఆ కేసు విచార‌ణ స్లో అయింది. దీంతో చిక్కోటి త‌న చీక‌టి సామ్రాజ్యాన్ని య‌థాత‌దంగా న‌డిపాడు. ఇప్పుడు థాయ్ లాండ్ పోలీసుల‌కు దొరికాడు. ఫ‌లితంగా మ‌ళ్లీ కొంద‌రు ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్ల‌ను తెర‌మీద‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీలు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.