9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!

ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:04 PM IST

ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో నవంబర్ 9న భువనేశ్వర్ లో సమావేశం కానున్నారు. వంశధార నది మీదుగా నేరడి బ్యారేజీ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల సరిహద్దులోని కోట్టాయా గ్రామాల స్థితిగతులు ముఖ్యమంత్రుల ఎజెండాలో ఎక్కువగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

Also Read : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతినిస్తూ వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ ఈ ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది.ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని రాయగడ, గజపతి జిల్లాల్లోని 106 ఎకరాలకు పైగా భూమి నీటమునిగనుంది.దీంతో ఆయా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.నీట మునిగిన భూమికి పరిహారం చెల్లించడంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది.అయితే ఆంధ్రా ప్రతిపాదనలపై ఒడిశా ప్రభుత్వం ఇంకా స్పందించలేదని అధికారులు అంటున్నారు.ఏపీ సీఎం జగన్ ఈ సమస్యను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని అధికారులు అంటున్నారు.

Also Read : 21మంది పిల్ల‌ల‌ సరుకుల‌కు నెల‌కు ల‌క్ష‌.. ఇంకా పిల్ల‌లు కావాలంటున్న త‌ల్లి..

అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ముంపు సమస్యపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.కొట్టాయ్య గ్రామాల సమస్య కూడా సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉంది.ఇటీవలి కాలంలో ఒడిశా సరిహద్దులోని విజయనగరం జిల్లాలోని గ్రామాల్లోకి ఆంధ్రా అధికారులు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒడిశా పోలీసులు ఆ గ్రామాల్లోకి ఎవరిని రానివ్వకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొట్టయ్యా గ్రామాల ప్రజలు ఇటీవల విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు పోలీసు సూపరింటెండెంట్ను కలిశారు. తాము ఆంధ్రాలో భాగంగానే కొనసాగుతామని లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చారు.ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈ అంశంపై చర్చించి పరిష్కారానికి అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.