వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో విచారణ నిమిత్తం చెవిరెడ్డిని మూడు రోజులపాటు సిట్ కస్టడీకి తీసుకుంటూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జిల్లా జైలు వద్ద చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ మీడియా ఎదుట వాపోయారు.
No Fuel : ఢిల్లీలో నేటి నుంచి ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. ఎందుకంటే?
“నాపై తప్పుడు కేసులు పెట్టారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవ్వరినీ వదలనూ” అంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ సమయంలో పోలీసులు చెవిరెడ్డిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. చెవిరెడ్డిని జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణ కోసం మరో మాజీ నేత వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అదుపులోకి తీసుకుంది.
చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. తనపై జరిగే దాడులు, అక్రమ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని చెవిరెడ్డి నొక్కిచెప్పారు. “కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది” అని చెవిరెడ్డి వ్యాఖ్యానించిన తీరు, అధికార యంత్రాంగంపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ కేసు విచారణ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.