Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రన్న మాట ఇచ్చాడంటే దేవుడు తథాస్తు అన్నట్లే..!!

Cbn Sithamma

Cbn Sithamma

టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు (Chandrababu) మాట ఇచ్చాడంటే…దేవుడు తథాస్తు అన్నట్లే అని మరో సారి రుజువైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో పూరి గుడిసెలో జీవిస్తున్న బాణావత్ పాములు నాయక్, సీతమ్మ దంపతుల పరిస్థితి అందర్నీ కదిలించింది. ఆరునెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..పెనుమాక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2024 జులై 1న ఈ దంపతుల గుడిసెకు వెళ్లారు. స్వయంగా వారి గుడిసెలకు వెళ్లి, వారి కష్టాలను నేరుగా చూసారు. శిధిలావస్థలో ఉన్న గుడిసెను చూసి, మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు.

మాట ఇవ్వడమే ఆలస్యం..చక్కటి డాబా ఇల్లు నిర్మించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు. గుడిసెలో ఉన్న ఆ కుటుంబం కోసం రూపొందించిన ఇంటి నిర్మాణం ఆరు నెలల్లోనే పూర్తయింది. జనవరి మొదటి వారంలో గృహప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘనత మొత్తం చంద్రబాబుదని, ఆయన ఇచ్చిన హామీకి నిలబడ్డారని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి నాయకుల్లా మాట ఇచ్చి మరచిపోయే నేత కాదు మా చంద్రన్న..మాట ఇచ్చాడంటే నిలబెట్టుకునే దేవుడు అంటూ స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు నిర్మాణం పూర్తయిన అనంతరం, బాణావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. “ఇలా స్వయంగా మా గుడిసెకు వచ్చి, మా కోసం ఇల్లు కట్టించి ఇచ్చిన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని పేర్కొన్నారు.

Read Also : SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్