Site icon HashtagU Telugu

Pending Employee Dues : ఉద్యోగుల్లో ఆనందం నింపిన చంద్రన్న

CM Chandrababu

CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల (Employee ) సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న నాయకుడిగా ముద్రపడిన చంద్రబాబు, ఇప్పుడు వారిని తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేతనాలు ఆలస్యం, బకాయిలు చెల్లించకపోవడం, అనేక సంక్షేమ పథకాలు నిలిపివేయడం వంటి కారణాలతో ఉద్యోగుల్లో వైసీపీపై తీవ్ర అసంతృప్తి పెరిగింది. దీనివల్ల మొన్నటి ఎన్నికల్లో ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే మద్దతును నిలబెట్టుకోవడానికి, ఉద్యోగుల బకాయిలను విడుదల చేసి వారికి న్యాయం చేస్తున్నారు.

Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు CPS, GPF, APGLI వంటి నిధులు విడుదల కాలేదు. మొత్తం రూ. 7,000 కోట్లు ఉద్యోగులకు బకాయిలుగా పెండింగ్‌లో ఉన్నాయి. జగన్ హయాంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం గొంతెత్తినా, వారిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, నిర్బంధానికి గురిచేశారు. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే, ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టి, సంక్రాంతి సందర్భంగా రూ. 1,033 కోట్లు విడుదల చేశారు. తాజాగా రూ. 6,200 కోట్ల నిధులు విడుదల చేయడంతో ఉద్యోగుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.

Dating App : యువకుడి ప్రాణాలు తీసిన డేటింగ్ యాప్

ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందన్న నమ్మకంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా, ఈసారి చంద్రబాబు ఉద్యోగులను పక్కన పెట్టకుండా, వారికి సకాలంలో వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంతో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని, అధికార వర్గాలు భావిస్తున్నాయి. సామాన్య ఉద్యోగి నుంచి ఉపాధ్యాయుల వరకు అందరికీ ఈ నిధుల విడుదల ఉపశమనాన్ని కలిగించనుంది.