CBN ISB : ద‌టీజ్ చంద్ర‌బాబు విజ‌న్! నిస్వార్థ సేవ‌కు అరుదైన గౌర‌వం!

నిస్వార్థ సేవ‌కు గుర్తింపు ఉంటుంద‌ని చంద్ర‌బాబు(CBN) నిరూపించారు.

  • Written By:
  • Publish Date - December 15, 2022 / 05:41 PM IST

నిస్వార్థ సేవ‌కు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంద‌ని చంద్ర‌బాబు(CBN) నిరూపించారు. రెండు ద‌శాబ్దాల క్రితం ఆయ‌న చేసిన ఆలోచ‌న ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ‌లాల‌ను ఇస్తోంది. అందుకు గుర్తింపుగా హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్స‌వ ముగింపు స‌భ‌కు ఆహ్వానం ల‌భించింది. ప్ర‌స్తుతం ఆయ‌న అధికారంలో లేరు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌గా మాత్ర‌మే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య రాజ‌కీయ‌వేత్త‌గా మాత్ర‌మే మిగిలారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సేసిన సేవ‌ల్ని గుర్తించుకుని ఐఎస్ బీ(ISB) ముఖ్య అతిథిగా గౌర‌విస్తూ ఆహ్వానం పంప‌డం నిస్వార్థ సేవ‌కు నిద‌ర్శ‌నం.

వార్షికోత్స‌వ ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా ఐఎస్ బీ 2001లో నాటి ప్రధాని వాజ్ పేయి చేతుల మీదుగా హైదరాబాద్ లో ప్రారంభించిన అంశాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. కానీ, నాడు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు(CBN) చేసిన కృషినిగానీ ఆయ‌న పేరునుగానీ ప్రస్తావించలేదు. ఆ స‌మావేశం ముగించుకుని మోడీ తిరుగు ప్ర‌యాణం అయిన‌ త‌రువాత పార్టీ నేతల వద్ద ఇదే అంశాన్ని బాబు ప్రస్తావించారు. ప్రధాని తన పేరు చెప్పకపోయినా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) 20వ వార్షికోత్సవం చేసుకుంటూ ఖ్యాతి సంపాదించటం సంతోషాన్ని ఇస్తుంద‌ని స‌హ‌చ‌రుల‌తో పంచుకున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా 20ఏళ్ల నాటి జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు

ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు దక్కించుకుంది. ఎంతో మంది విద్యార్ధులను వ్యాపార‌వేత్తలుగా ఇక్కడ తీర్చి దిద్దారు. ఈ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తయింది. గచ్చిబౌలిలో సంస్థ 20వ వార్షికోత్సవ సంబరాలకు ప్రధాని హాజ‌రుకాగా, ఇప్పుడు ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిధిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు(CBN) ఆహ్వానం ల‌భించ‌డం గ‌మనార్హం. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆనాడు సంస్థ ఏర్పాటులో చేసిన‌ కృషికి గుర్తింపుగా ల‌భించిన ఆహ్వానం మేర‌కు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) ప్రాంగణంలో జరిగే ముగింపు వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడ‌బోతున్నారు.

నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూపించిన చొరవ ఫలితం ఇప్పుడు ఈ గౌరవానికి కారణమైంది. ఆ సంస్థ గురించి పదే పదే ప్రస్తావించే చంద్రబాబు అక్కడ‌ తన అనుభవాలను పంచుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు హైదరాబాద్ కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తీసుకొచ్చేందుకు చేసిన ప్ర‌య‌త్నాన్ని పలుమార్లు గుర్తు చేసుకున్నారు. అప్ప‌ట్లో ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు, నాటి ప్రధాని వాజ్ పేయ్ ను ఒప్పించి అనుమతులు తెచ్చారు. ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారు.

చంద్రబాబు ముఖాముఖి

ఇప్పుడు అదే సంస్థలో చంద్రబాబును ఆహ్వానించటం, అక్కడ విద్యార్ధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించటంపై స‌ర్వ‌త్రా ఆసక్తి నెలకొంది.అప్ప‌ట్లో హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు వేరు. ఆనాడు ఆయ‌న‌కున్న విజన్ గురించి చంద్రబాబు వివరించనున్నారు. హైదరాబాద్ లో ప్రారంభించిన పలు ప్రాజెక్టులు తరువాతి ప్రభుత్వాలు కొనసాగించిన తీరును చంద్రబాబు పలు సందర్భాల్లో ట్వీట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చంద్రబాబు ఇచ్చే ప్ర‌సంగం ఆస‌క్తి క‌లిగిస్తోంది.

NCBN Security: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమీక్ష