Site icon HashtagU Telugu

Viral : చంద్రబాబు మంత్రివర్గం ఇదేనా..?

Babu Cabinet

Babu Cabinet

యావత్ తెలుగు ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మాట వినే సమయం వచ్చేసింది. “నారా చంద్రబాబు నాయుడు అనే నేను” అంటూ సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 12 న జరగబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11 గంటల 27నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు అవుతున్నారు.

ఇక చంద్రబాబు మంత్రి వర్గం (Chandrababu ‘s cabinet)లో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందో అనే ఆసక్తి నెలకొంది. ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు.. పార్టీలో సీనియర్లు చాలామంది ఈసారి రేసులో ఉన్నారు. అటు జనసేన, బీజేపీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. దీంతో చంద్రబాబు ఎవరికీ ఆ పదవులు కట్టబెడతారో అని మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియా లో ఓ లిస్ట్ వైరల్ గా మారింది. ఆ లిస్ట్ లో పలువురికి మంత్రి పదవులు ఇస్తున్నట్లు రాసి ఉండడంతో అంత ఆ లిస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు కొత్త కాబినెట్ (Chandrababu Cabinet) ఇదే…

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం – హోంశాఖ
నారా లోకేష్ – మున్సిపల్ & ఐటీశాఖ
కింజరాపు అచ్చెన్నాయుడు – ఆర్థికశాఖ
నిమ్మకాయల చినరాజప్ప –
గోరంట్ల బుచ్చయ్య చౌదరి – పౌరసరఫరాలశాఖ
పితాని సత్యనారాయణ – బీసీ వెల్ఫేర్
రఘురామ కృష్ణరాజు – స్పీకర్
బొండా ఉమామహేశ్వరరావు – రవాణా & రోడ్లు, భవనాలశాఖ
ఆనం రాంనారాయణరెడ్డి – నీటిపారుదలశాఖ
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – వ్యవసాయశాఖ
పయ్యావుల కేశవ్ – రూరల్ డెవలెప్‌మెంట్
పరిటాల సునీత – ఉమెన్ & ఫ్యామిలీ వెల్ఫేర్
నందమూరి బాలకృష్ణ – సినిమాటోగ్రఫీ
పొంగూరు నారాయణ – విద్యాశాఖ
గంటా శ్రీనివాసరావు – పంచాయతీరాజ్
చింతకాయల అయ్యన్నపాత్రుడు – అటవీ & పర్యావరణశాఖ
భూమా అఖిలప్రియ – టూరిజం & సాంస్కృతిక శాఖ
మహ్మద్ షారూఖ్ – మైనార్టీ
నాదెండ్ల మనోహర్ – పరిశ్రమలు ( జనసేన)
మండలి బుద్ద ప్రసాద్ – పశుసంవర్థకశాఖ (జనసేన)
కామినేని శ్రీనివాస్ – వైద్య ఆరోగ్యశాఖ (బీజేపీ)
విష్ణకుమార్ రాజు – దేవాదాయశాఖ (బీజేపీ)
కొణతాల రామకృష్ణ – విద్యుత్‌శాఖ ( జనసేన)
జ్యోతుల నెహ్రూ – ఎక్సైజ్ శాఖ

మరి ఈ లిస్ట్ లో ఉన్నట్లే మంత్రి పదవులు దక్కబోతున్నాయా..? అనేది చూడాలి.

Read Also : Health Problems: జీలకర్ర నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?