Site icon HashtagU Telugu

Vishal : చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరం..!: విశాల్

Vishal Comments on Chandrababu Arrest

Chandrababu's Arrest Is Very Sad..! Vishal

Vishal Comments on Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు జరిగిన అరెస్ట్ పై ప్రముఖ సినీ హీరో విశాల్ స్పందించారు. చంద్రబాబు గొప్ప నాయకుడని… ఆయనకే ఇలాంటి పరిస్థితి వస్తే, మిగతా సామాన్యుడి పరిస్థితి ఏమిటని విశాల్ (Vishal) అన్నారు. చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తనకే భయం వేస్తోందని తెలిపారు. చంద్రబాబు నిజాయతీ గల నేత అని విశాల్ (Vishal) చెప్పారు. ఆ నేతకు ఇలాంటి దుస్థితి రావడం చాల బాధను కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ బాధాకరమని, ఆయనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాటయోధుడని ఆయన అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవాలనుకున్నానని… అయితే, ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని చెప్పారు.

Also Read:  Jagan Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు..